Russia: కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు ‘మదర్ హీరోయిన్’ అవార్డును అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేయనున్నారు. మదర్ హీరోయిన్ అవార్డుకు ఎంపికైన మహిళలకు రూ.13 లక్షల నగదును అందిస్తారు. ఈ అవార్డు 1990-94 మధ్య కాలంలో ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అవార్డును నిలిపివేశారు. కొన్నినెలల కిందట రష్యా అధ్యక్షుడు […]
Tribute To Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా […]
Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్ […]
Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్‌లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్‌ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ […]
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్‌కు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ముంబై టీమ్‌లో మార్పులు అవసరమని.. తాను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నానని పొలార్డ్ పోస్ట్ చేశాడు. అయితే తాను ఎప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు అండగానే ఉంటానని పొలార్డ్ తెలియజేశాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై […]
Myntra Tweet: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పసికూనలపై రెండు హాఫ్ సెంచరీలు మినహా బలమైన జట్లపై చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. దీంతో అతడి వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, అతడి ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ట్రోలింగ్‌ను ఓ కంపెనీ […]
Ambati Ramababu: విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మోదీతో పవన్ సమావేశం ముగిసింది. అయితే ఈ భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘మోదీతో మీటింగు.. బాబుతో డేటింగ్’ అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ పట్ల జనసేన అభిమానులు కూడా […]
Ramiz Raja: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్‌కు చేరింది. అయితే మరో సెమీస్‌లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే […]
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 13న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు – […]
BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే […]