High Court: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జగన్ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఇతరులకు స్థలాలు కేటాయించడంపై కొందరు రైతులు హైకోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ భూములు వేరేవారికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. కొత్తచట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని […]
Team India: 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లకుండానే వెనుతిరిగిన టీమిండియా ఈ ఏడాది మాత్రం సెమీస్‌కు వెళ్లి ఆశలు రేకెత్తించింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోరంగా ఓటమి చెంది టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం టీమిండియాను దెబ్బతీసిందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్‌గా ఉన్నారని.. ఈ అంశం భారత జట్టుకు శాపంగా మారిందని అభిమానులు కామెంట్ […]
CM Jagan: ఎన్టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్ డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను సీనియర్ జర్నలిస్ట్ రెహానా పెన్‌డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దీంతో ఆమెను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, […]
ICC T20 Rankings: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాకు ఇంగ్లండ్ రూపంలో షాక్ తగిలింది. ఫైనల్‌కు వెళ్లి చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొని కప్‌ను ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మాత్రం టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ (264), పాకిస్థాన్ (258), దక్షిణాఫ్రికా (256), న్యూజిలాండ్ (253) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. దీంతో కప్ పోయినా.. ర్యాంకు మిగిలిందంటూ నెటిజన్‌లు సెటైర్లు […]
Twitter Blue Ticks: ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్‌లో భారీ మార్పులు సంభవించాయి. గతంలో ట్విట్టర్‌లో బ్లూటిక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.719 చందా కడితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నకిలీ ఖాతాలకు కూడా బ్లూటిక్కులు దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఎక్కువ నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్ కనిపిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ దుర్వినియోగం అవుతోందని […]
Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. […]
Virat Kohli: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చినట్లుంది టీమిండియా పరిస్థితి. 9 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా అభిమానులను నిరాశపరుస్తున్న భారత జట్టు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులు మాత్రం సాధిస్తూ సంతోషపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా ఇంటి దారి పట్టింది. కానీ ఈ సెమీస్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగత రికార్డుల పంట పండించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 […]
Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్‌ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్‌పై 17 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్‌పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పై కూడా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన […]
IPL 2023: గత రెండేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మెగా టీ20 లీగ్‌ను విదేశాల్లో నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఇండియాలోనే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు మినీ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలంలో పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్రాంచైజీకి అదనంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం ఈ రూ.5 కోట్లకు అదనం. ఐపీఎల్ […]
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్‌లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్‌లో టీమిండియాను ఓడిస్తామని […]