Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం […]
Lunar Eclipse: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. కానీ చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందో చాలా మందికి తెలియదు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు […]
CM Ramesh: రాజ్యసభ ఎథిక్స్ కమిటీని పునర్‌వ్యవస్థీకరిస్తూ సభ కార్యాలయం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది. అటు ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్‌కు అరుదైన అవకాశం దక్కింది. హౌస్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రమేష్‌ను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి సభ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజ్యసభ నుంచి ఈ నెల […]
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్‌కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ […]
Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రముఖ నటుడు అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ చెప్పారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరీ తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని.. […]
Srilanka Board: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అత్యాచార ఆరోపణల కారణంగా ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన గుణతిలక ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ మేరకు అతడు అరెస్ట్ కావడంతో ధనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. […]
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డిపై రచించిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి చిరస్మరణీయుడు పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి […]
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఈవారం నాకౌట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. బుధవారం నాడు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ తలపడనుండగా.. గురువారం నాడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మేరు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీ) జాబితాను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా రిచర్డ్ కెటిల్‌బరో, మైఖేల్ గాఫ్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. క్రిస్ బ్రాడ్ […]
Lunar Eclipse: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఆరోజున అందరూ ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల వెలుగులతో విరజిమ్ముతాడు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో పండగ జరుపుకోవడంపై చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకాలం ఏర్పడుతోంది. హిందూ పురాణాల ప్రకారం సూతకాలంలో ఎలాంటి […]