తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హోటల్‌లో కలిశారన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదన్నారు.
Read Also: మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి రాజాసింగ్ కౌంటర్
తాను మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను కలిశానని.. అందులో భాగంగానే రేవంత్‌ను కలిశానని ఈటెల తెలిపారు. అయితే రేవంత్‌ను కలవడంలో తప్పేముందని కేటీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరలేదా అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసం పలువురు నేతలను కలిస్తే తప్పేంటని ఈటెల రాజేందర్ సూటి ప్రశ్న వేశారు. రేవంత్ రెడ్డిని కలవడం.. సంస్కార హీనమైతే కాదు కదా అని ఈటెల వ్యాఖ్యానించారు.