ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ ఫీవర్ నెలకొంది. ఇప్పటికే అసలు పోరు ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మహా సమరం జరగనుంది. అయితే కొన్ని రికార్డుల గురించి తెలుసుకోవాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యిందో ఎవరో తెలుసుకుందాం పదండి.
Read Also: టీమిండియాతో తలపడే పాకిస్థాన్ జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌లలో పాకిస్థాన్ ఆటగాడు ఉండటం గమనార్హం. షాహిద్ అఫ్రిది అత్యధికంగా 5 సార్లు డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడితో పాటు మరో ఆటగాడు కూడా ఈ రికార్డును పంచుకున్నాడు. శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ కూడా 5 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానంలోనూ శ్రీలంక ఆటగాడే ఉన్నాడు. సనత్ జయసూర్య నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన లెండల్ సిమ్మన్స్ కూడా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుతిరిగాడు. ఇంగ్లండ్ ఆటగాడు ల్యూక్ రైట్ కూడా నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. టాప్-5లో భారత ఆటగాళ్లు లేకపోవడం విశేషం.