తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్రమంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నారు.
Read Also: విశాఖ టూర్… వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్
కాగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై చేసిన దాడులకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరాహార దీక్ష శుక్రవారం రాత్రి ముగిసింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.