Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్‌ను షార్ట్ ఫామ్‌లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో శివ కార్తికేయన్. ఇటీవలే ‘ప్రిన్స్’ సినిమాలో నటించిన శివ కార్తికేయన్, సోషల్ మీడియాలో అజిత్ ని కలిసిన ఫోటో ఒకటి […]
Andhra Pradesh: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకుంటుందన్న ఆశలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం నూతన సారథిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాంగ్రెస్ […]
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. […]
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 836 పాయింట్లు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్-3 నుంచి కిందకు పడిపోయాడు. గత వారం వరకు మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌ను న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ […]
Costly Medicine: మాములుగా అనారోగ్యానికి గురైతే కొనుగోలు చేసే ఔషధాల ధరలు మహా అయితే వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తాజాగా మార్కెట్లో విడుదలైంది. ‘హిమోఫిలియా బి’ అనే సమస్యకు ఈ ఔషధాన్ని సీఎస్ఎల్ లిమిటెడ్ తయారుచేసింది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే. ఆస్ట్రేలియాలో ఈ ఔషధం ధరను 3.5 మిలియన్ […]
Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటివలే 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ […]
CM Jagan: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో సీఎం జగన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. ఆయన్ను చూసిన కొంతమంది కలవడానికి ప్రయత్నించారు. అంత రద్దీలోనూ వారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని […]
OTT Updates: యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్, అంజలి, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటీవల సినిమాలు 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ విడుదలై 100 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు మాచర్ల […]
Kamal Haasan: లోకనాయకుడు ‘కమల్ హాసన్’ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. మరో పాన్ ఇండియా హిట్‌ను టార్గెట్ చేసిన కమల్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కు షెడ్యూల్ గ్యాప్ రావడంతో బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్, తనకి ఎన్నో మైల్ స్టోన్ సినిమాలను ఇచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్, కె.విశ్వనాథ్‌కు […]
VijayaSaiReddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు. విజయసాయిరెడ్డి లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో […]