Tomota Prices: ఏపీలో టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటాకు కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమోటాలను తెలంగాణలో మాత్రం పలు ప్రాంతాల్లో కిలోకు 15 నుంచి […]
CPI Narayana: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ప్రముఖ హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘీక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ […]
Team India: న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత జట్టు ఆడనుంది. ఈ పర్యటనకు గతంలో జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. అయితే అతడు బంగ్లాదేశ్ వెళ్లడం ఇప్పుడు అనుమానంగా మారింది. జడేజా గాయంపై సస్పెన్స్ నెలకొంది. ఇంకా అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. దీంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉంటాడని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. […]
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. డిసెంబర్ 1,2022 నుంచి నవంబర్ 30,2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ […]
Kodali Nani: మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని చెప్పారు. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని కొడాలి నాని గుర్తుచేశారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే […]
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని […]
Rare Disease: సాధారణంగా ప్రతి మనిషికి తల, మర్మాంగాలను మినహాయిస్తే చెస్ట్, కాళ్లు, చేతులపై మాత్రమే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల లలిత్ పాటిదార్ మాత్రం అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హైపర్ ట్రికోసిస్ అనే వ్యాధి కారణంగా లలిత్ పాటిదార్ శరీరం అంతటా విపరీతంగా వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఆరేళ్ల వయసు నుంచి తనకు శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయని, పాఠశాలలో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ పాటిదార్ చెబుతున్నాడు. కోతి […]
T20 World Cup: 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీ20 ప్రపంచకప్ 2021, 2022లో క్వాలిఫయింగ్ దశలున్నాయి. కానీ టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్ ఉండదు. అదే సమయంలో సూపర్ 12 కూడా ఉండదు. 2024 ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కొత్త ఫార్మాట్ వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది. అభిమానులకు మజా ఇచ్చే రీతిలో వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ కోసం ఏకంగా 20 […]
Aus Vs Eng: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్‌లో ఆడుతోంది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టేనా అని చాలా మందికి అనుమానం వచ్చింది. అంత ఘోరంగా ఈ వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. […]
IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ గెలవకపోయినా మంచి ప్రదర్శనే చేసింది. ఒక దశలో హ్యాట్రిక్ వికెట్లు సాధించేలా కనిపించింది. అయినా హ్యాట్రిక్ నమోదైంది. అయితే ఈ హ్యాట్రిక్ బౌలర్ ఖాతాలో పడలేదు. టీమిండియా ఖాతాలో పడింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో డారిల్ మిచెల్ పెవిలియన్ బాట పట్టాడు. రెండో బంతిని అర్ష్‌దీప్ […]