Shardul Thakur: టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఒక్క ఓవర్‌తో టీమిండియా నుంచి మ్యాచ్‌ను అతడు దూరం చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ ఐదు బౌండరీలతో 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్‌వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని వైడ్ వేయగా.. ఎక్స్‌ట్రా బాల్‌ను బౌండరీ తరలించాడు. […]
Rail Engine Theft: బీహార్‌లో రైలు ఇంజిన్‌ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్‌ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను […]
OTT Updates: సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రెండో వారం కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా నిర్మాతకు లాభాల పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతోంది. సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ గాలోడు మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం శాటిలైట్, ఓటీటీ హక్కులు […]
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని ఆయనతో పాటు కలిసి నడిచాడు. ఈ సందర్భంగా మీసం తిప్పాలని విజేందర్ సింగ్ కోరాడు. దీంతో అతడి వినతి మేరకు విజేందర్‌తో కలిసి రాహుల్ గాంధీ మీసం మెలేశారు. ఈ […]
Manish Pandey: బీసీసీఐపై టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌లో సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐపై తీవ్ర విమర్శలు రాగా మనీష్ పాండే కూడా అభిమానులకు మద్దతు పలికాడు. గతంలో పదే పదే తనను రిజర్వుబెంచ్‌పై కూర్చోబెట్టి తన కెరీర్ నాశనం చేశారని.. ఇప్పుడు సంజు శాంసన్ కెరీర్ కూడా అలాగే చేస్తున్నారని మనీష్ పాండే అన్నాడు. తనను జట్టులోకి ఎంపిక చేయకుండా రిజర్వు […]
Narendra Modi: అంతర్జాతీయ స్థాయిలో మన ప్రధాని మోదీకి ఇప్పటికే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రపంచంలో తాను తిరుగులేని నేతను అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి ఆయన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే […]
26/11 Mumbai Attacks: ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయగానే స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ రాహుల్ షిండే అందులోకి వెళ్లారు. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో రాహుల్ షిండే మరణించారు. ఈ మేరకు ప్రాణాలు అర్పించిన ఆయన పేరును ఓ గ్రామానికి పెట్టారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాహుల్ స్వగ్రామం సోలాపుర్ జిల్లా […]
England: ఈ ప్రపంచంలో పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ కూడా చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. అతడికి కాబోయే భార్య మోలీ కింగ్ తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు తమ కూతురి […]
IND Vs NZ: ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒక దశలో న్యూజిలాండ్ ఓటమి ఖాయం అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యంగా లాథమ్ భారీ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి […]