Kamal Haasan: లోకనాయకుడు ‘కమల్ హాసన్’ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. మరో పాన్ ఇండియా హిట్‌ను టార్గెట్ చేసిన కమల్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కు షెడ్యూల్ గ్యాప్ రావడంతో బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్, తనకి ఎన్నో మైల్ స్టోన్ సినిమాలను ఇచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్, కె.విశ్వనాథ్‌కు నమస్కరిస్తున్న ఒక ఫోటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన వాళ్లు అపూర్వ సంగమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Adivi Sesh: మరో పెద్ద బ్యానర్‌లో అడివి శేష్ పాన్ ఇండియా సినిమా
కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘సాగర సంగమం’(1983). ఈ సినిమాలో కమల్ హాసన్ డాన్సర్‌గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆల్ టైం క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘సాగర సంగమం’ సినిమా తర్వాత రెండేళ్లకే మళ్లీ కలిసిన కమల్, విశ్వనాథ్ ఈసారి ‘స్వాతి ముత్యం’(1985) చేశారు, ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇలా రెండు క్లాసిక్ మూవీస్ చేసిన కమల్, విశ్వనాథ్ దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకుని మూడోసారి ‘శుభ సంకల్పం’(1995) సినిమా చేశారు. మొదటి రెండు సినిమాల్లాగే శుభ సంకల్పం కూడా ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇలా ఈ మూడు సినిమాలు దేనికదే చాలా స్పెషల్‌గా నిలిచాయి. అటు మ్యూజికల్‌గా, ఇటు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించిన ఈ సినిమాల్లోని కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్‌ను ఆడియన్స్ ఇప్పటికీ వింటూ ఉంటారు.