Jogi Ramesh: టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పత్తిత్తులు, వృద్ధ సైకో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఓ అచ్చోసిన ఆంబోతు, ఓ నికృష్ట వెధవ, పిల్ల సైకో, ప్యాకేజీ సైకో ఎలా మాట్లాడారో అందరూ చూశారని.. నిండు సభలో జగన్‌ను బోండా ఉమ పాతరేస్తా అన్నాడని మంత్రి జోగి రమేష్ […]
FIFA World Cup: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో మూడో రోజు పెను సంచలనం నమోదైంది. బలమైన జట్టు అర్జెంటీనాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న అర్జెంటీనాను 2-1 తేడాతో సౌదీ అరేబియా ఓడించి పెను సంచలనం నమోదు చేసింది. అర్జెంటీనా తరఫున సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మాత్రమే గోల్ చేశాడు. ఆట మొదలైన 9వ […]
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఆకట్టుకుంటున్నాయి. ‘స్టార్ లైనర్’ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 2+1 స్లీపర్ కోచ్ తరహాలో ఉండే ఈ బస్సులో 30 బెర్తులు ఉంటాయి. ఏసీ పడని వారికి ఈ బస్సు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బస్సులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. రీడింగ్ ల్యాంప్స్, సీసీటీవీ, ఆడియో, ఛార్జింగ్ పోర్ట్స్, ఫైర్ సేఫ్టీ అలారమ్, ప్రతి బెర్త్‌కు లగేజ్ ర్యాక్ లాంటి […]
Nellore District: ఈ లోకంలో కన్నబిడ్డలపై ప్రేమ లేని తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఓ తండ్రి తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు. కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, […]
IND Vs NZ: నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 టైగా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయిందని అంపైర్లు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. […]
Nadendla Manohar: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీని రౌడీసేన అంటున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని […]
IND Vs NZ: నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ సహకారం అందించాడు. అయితే వీళ్లిద్దరూ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో కివీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయ్యింది. అయితే కాన్వే, ఫిలిప్స్ కారణంగా న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. […]
West Indies: ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై సూపర్-12 దశకు అర్హత సాధించకుండానే వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం జింబాబ్వేపై మాత్రమే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచకప్‌లో వైఫల్యానికి గల కారణాలను తెలుసుకున్న లారా […]
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈనెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉదయం 11 […]
Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరోసారి తన వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ అందించింది. నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ 57 శాతం పెంచేసింది. 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్‌ను రూ.99 నుంచి ఏకంగా రూ.155కి పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు కావాలంటే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ట్రయల్ ప్లాన్‌గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్‌టెల్ త్వరలో […]