Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ స్లోగన్ ఒకటే జగన్‌ను గెలవనీయం అంటాడని.. మమ్మల్ని గెలిపించేది, ఓడించేది ప్రజలు అని.. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా […]
Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం […]
Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అన్నమయ్య డ్యామ్ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా లష్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అన్నమయ్య డ్యామ్ బాధిత యువకుడు వంశీకి రూ.50 వేలు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ అంశంపై జనసేన పార్టీ ముందుగా […]
Team India: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షార్పణం అయినా ఈ వన్డేలో టీమిండియా జట్టు ఎంపిక పలు విమర్శలకు తావిచ్చింది. తొలి వన్డేలో 36 పరుగులతో రాణించిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియాను దెబ్బతీసిందని.. అందుకే రెండో వన్డేలో దీపక్ హుడాను తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వివరణ ఇచ్చాడు. అయితే పదే పదే విఫలమవుతున్న […]
Jogi Ramesh: ఆదివారం నాడు వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసివచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచుకూడ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జనసేనను సైకో సేనగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పవన్ లాంటి సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళ్తుంటారని మండిపడ్డారు. ఈ సైకోలు రాత్రిపూట సంచరించే రౌడీలు, గుండాలు, […]
Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల […]
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో […]
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దేశం కంటే భార్య పోటీ చేస్తున్న ఎన్నికలు ముఖ్యమా అని నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది. కానీ తనకు ఇంకా […]
Selfie Tragedy: ప్రస్తుతం ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో నలుగురు యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలను బలి తీసుకుంది. బెళగావి జిల్లాలో శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్ వద్ద నలుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది […]
Bhanu Prakash Reddy: తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ప్రభుత్వం క్రీస్తుప్రదేశ్‌గా మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా రిసిప్ట్‌పై క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ మౌనమునిలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలు దూప దీప […]