Narendra Modi: అంతర్జాతీయ స్థాయిలో మన ప్రధాని మోదీకి ఇప్పటికే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రపంచంలో తాను తిరుగులేని నేతను అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి ఆయన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే ఈ విషయం వెల్లడించింది. ఈ మేరకు 22 దేశాల అధినేతల రేటింగ్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వాలు, నేతల తీరును మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ట్రాక్ చేస్తుంది.
ఈ సర్వే విడుదల చేసిన జాబితాలో 56 శాతం రేటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం రేటింగ్‌తో మూడో స్థానాన్ని ఆక్రమించారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 38 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 36 శాతం రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు. జపాన్ ప్రధాని కిషిండా 23 శాతం రేటింగ్‌తో ఆరో స్థానం సంపాదించారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోదీ 75 శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచారు. తాజా సర్వేలో ప్రధాని మోదీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనించాల్సిన విషయం.
Read Also: అవకాశాల కోసం శ్రీముఖి కూడా ఇలా దిగజారి..
అటు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, అమెరికాలలోని ప్రభుత్వ నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ట్రాక్ చేస్తుంది. అంతర్జాతీయంగా రోజుకు సుమారు 20,000 ఇంటర్వ్యూలు చేస్తుంది. రాజకీయ ఎన్నికలు, ఎన్నికైన ప్రతినిధులు, ఓటింగ్ సమస్యలపై రియల్ టైమ్ పోలింగ్ డేటాను అందుబాటులో ఉంచుతుంది. కాగా మన దేశంలో అక్షరాస్యులైన వయోజనులను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.
Yet again PM Shri @narendramodi tops the global podium.
Approval ratings of PM Modi are the highest among all major world leaders. pic.twitter.com/Y97GCXRmFB
— BJP (@BJP4India) November 24, 2022