Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ […]
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని […]
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ నియామకాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 22న, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోస్టుల దరఖాస్తు […]
Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు. యువరాజ్ కేవలం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే రుతురాజ్ మాత్రం 7 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. మధ్యలో ఓ నోబాల్ పడటంతో ఒకే ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లో […]
Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. వీకెండ్ పొలిటీషియన్ మరోసారి వచ్చి తమ పార్టీపై విమర్శలు చేశాడని.. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్‌లు పెడితే ప్రజలు ఆయన్ను నమ్మరని ఎద్దేవా చేశారు. రెండు గంటల పాటు డ్రామా చేసి వెళ్తున్నారని.. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదని రోజా ఆరోపించారు. పవన్ ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఎడమకాలి […]
Rapthadu Heat: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, అక్రమ అరెస్ట్ బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీకే పల్లి […]
Sasana Sabha: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఈ మూవీలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్‌ను […]
Somu Veerraju: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏలూరులోని బీసీ చైతన్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే […]
Guinness Record: ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ మరే లీగ్‌కు ఉండదు. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది మే నెలలో ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 […]
Allu Arjun: హీరోయిన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. టాలీవుడ్‌లో నటించిన ఒకే ఒక్క సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల తన అందంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. వాస్తవానికి పెళ్లిసందD సినిమా యావరేజ్‌గా నిలిచినా తన అందచందాలు, గ్లామర్ తళుకులతో అభిమానులను శ్రీలీల ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ యువహీరోలందరూ ఆమె వెంటే పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రవితేజ ధమాకా, నవీన్ పొలిశెట్టి […]