Cricketers Marriage: శ్రీలంక క్రికెట్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. శ్రీలంక క్రికెటర్లు కసున్ రజిత, చరిత్ అసలంక, పథుమ్ నిశాంక సోమవారం నాడు కొలంబోలో వేర్వేరు చోట్ల వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలను ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపింది. వీరంతా ప్రస్తుతం అప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో అఫ్ఘనిస్తాన్ గెలవగా, రెండో వన్డే వర్షంతో […]
Minister Roja: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. […]
What’s Today: * నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్ * అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ * అమరావతి: నేడు మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో […]
Mosquito Bite: దోమలతో వ్యాధులు రావడం సహజం. దోమలు కుడితే డెంగీ లేదా మలేరియా వంటి వ్యాధులు సోకుతాయి. కానీ దోమ కుడితే కోమాలోకి వెళ్లి 30 సర్జరీలు చేయించుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా. ఊహించడం కాదు ఏకంగా ఇది నిజజీవితంలో చోటుచేసుకుంది. జర్మనీలో ఈ ఘటన జరిగింది. రోడెర్‌మార్క్ అనే ప్రాంతంలో 2021 వేసవిలో సెబాస్టియన్ అనే 27 ఏళ్ల వ్యక్తికి ఆసియా టైగర్ దోమ కుట్టడంతో సాధారణ జ్వరం వచ్చింది. దీంతో అతడు […]
Team India: ప్రస్తుతం టీమిండియాలో ఫామ్‌లో లేని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు రిషబ్ పంత్. అతడు పదే పదే విఫలమవుతున్నా అవకాశాలు మాత్రం ఇంకా ఇస్తున్నారు. ఒకానొక సమయంలో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అనేక అవకాశాలు ఇస్తున్నా అతడి ఆటతీరులో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పంత్ ఆటతీరుపై స్పందించారు. ‘ఎన్నడా […]
Botsa satyanarayana: ఏపీలో మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని.. శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. మరి చంద్రబాబు ఒప్పంద పత్రంలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని.. ఏపీలోని అన్ని […]
Ben Stokes: ఇటీవల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మరో సమరానికి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి ఈ రెండు జట్ల మధ్య పాకిస్థాన్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటోంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ముందే బెన్ స్టోక్స్ పాకిస్థాన్ ప్రజల మనసు దోచుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే తన […]
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. […]
Hyper Aadi: జబర్దస్త్ షోతో అదరిపోయే రీతిలో క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆదికి తీవ్ర అవమానం జరిగింది. లాక్కెళ్లి మరీ అతడికి గుండు కొట్టించారు. దీంతో హైపర్ ఆది బిక్కముఖం వేశాడు. దీంతో అతడి అభిమానులు హైపర్ ఆదికి ఏం జరిగిందని ఆరాలు తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షోతో పాటు హైపర్ ఆది మల్లెమాల సంస్థ వాళ్లు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ నటిస్తున్నాడు. ఇటీవల ఈ షోకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది. దాదాపు […]
Ambati Rambabu: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని మంత్రి అంబటి అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని శాశ్వతం అని తాను […]