తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కేసీఆర్‌ను తిడితే కొందరు అభిమానులు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగుతుంటారు. కేసీఆర్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Read Also: సింహంతో వేట.. జగన్‌తో ఆట మంచిది కాదు: ఎమ్మెల్యే రోజా
సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని ఆరోపిస్తూ… రాజ్‌భవన్ ఎదుట సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాగార్జున ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మంత్రులు రాజ్‌భవన్ వస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని సదరు వ్యక్తిని కాపాడారు. సీఎం కేసీఆర్ దేవుడి లాంటి వ్యక్తి అని, ప్రతిపక్షాలు ఆయన్ని తిడుతుంటే తట్టుకోలేకపోతున్నానని నాగార్జున వాపోయాడు. కేసీఆర్ కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నానని, అందుకే ఈ పనికి పూనుకున్నట్లు నాగార్జున పేర్కొన్నాడు.