నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. అయితే, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన ‘జనని’ పాత్ర ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద కసరత్తే చేసిందని తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read:Prabhas: ప్రభాస్ మోకాలు ఇంకా సెట్ కాలేదా?
సినిమాలోని ఆ బాలిక పాత్ర (జనని) చాలా పవర్‌ఫుల్ కావడంతో, ఆ పాత్రకు ఒక పాపులర్ ఫేస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు బోయపాటి భావించారట. ఇందులో భాగంగా మేకర్స్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేనితో ఆ పాత్ర చేయించాలని అనుకున్నారట. సితారకు ఉన్న సోషల్ మీడియా క్రేజ్ మరియు ఆమె చలాకీతనం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
Also Read:Yellamma : హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. అనౌన్స్ మెంట్ రాబోతుంది
సితార కుదరకపోవడంతో, మేకర్స్ తమ అన్వేషణను కొనసాగించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుమార్తె (దియా) పేరును కూడా పరిశీలించినట్లు సమాచారం. అలాగే, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కుమార్తెను కూడా ఆ పాత్ర కోసం సంప్రదించారట. లయ కుమార్తె కూడా అచ్చం తల్లిలాగే కళగా ఉండటంతో ఆ పాత్రకు బాగుంటుందని యూనిట్ భావించింది. ఇలా పలువురు స్టార్ కిడ్స్‌ను పరిశీలించిన తర్వాత, చివరకు ఆ ‘జనని’ పాత్ర ఒక బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ చెంతకు చేరింది.
ఆ పాత్రలో ఆమె చూపించిన నటన, పలికించిన హావభావాలు ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్యతో ఆమెకు ఉన్న బాండింగ్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం యాక్షన్, మాస్ డైలాగులకే పరిమితం కాకుండా, ఇలాంటి ఎమోషనల్ అండ్ డివైన్ క్యారెక్టర్లను డిజైన్ చేయడంలో బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ చూపించారు. ‘అఖండ 2’ ఇంతటి ఘనవిజయం సాధించడంలో ఈ ‘జనని’ పాత్ర కూడా ఒక కీలక భూమిక పోషించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.