Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి కూతురు సునీత పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
Somu Veerraju: ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మంగళవారం ఉదయం లేఖ రాశారు. ఈ సందర్భంగా 2004 నుంచి విశాఖలో, ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో కోరారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములే కాదు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు […]
Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్‌వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్‌లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్‌లు పంపించేందుకు […]
Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక […]
Sabarimala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల, మకరవిలక్కు పూజల కోసం ఈనెల 16 నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్లు, హుండీల ద్వారా రూ.12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు వచ్చిందని దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది […]
Rapthadu Heat: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొన్నిరోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ముసలోడు అని.. రాష్ట్రానికి ఏం చేయలేడని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పరుష పదజాలంతో నానా మాటలు అన్నారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ […]
1) ఫేక్ కాల్స్ & మెసేజ్‌లను చెక్.. ట్రాయ్ కొత్త ప్రణాళిక కొంతకాలం నుంచి సైబర్ నేరాలు ఎలా పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆఫర్లు, బహుమతులు వచ్చాయంటూ.. ఫేక్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు టోకరా వేసి, సున్నితంగా దోచేసుకుంటున్నారు. వీటిని తిరస్కరిస్తున్నప్పటికీ.. మరింత ఊరించేలా సందేశాలు పంపుతూ, టెంప్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్లు పంపిన లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం.. మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా మాటుమాయం అవుతాయి. […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=yF-iC1Z4x5Y
Andhra Pradesh: విశాఖకు చెందిన సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా సరోజ నిలిచారు. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’ కూడా దక్కాయి. అల్లూరి సరోజ ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్‌లలో పోటీ పడ్డారు. తన విభాగంలో గ్రాండ్ […]