Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. వీకెండ్ పొలిటీషియన్ మరోసారి వచ్చి తమ పార్టీపై విమర్శలు చేశాడని.. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్‌లు పెడితే ప్రజలు ఆయన్ను నమ్మరని ఎద్దేవా చేశారు. రెండు గంటల పాటు డ్రామా చేసి వెళ్తున్నారని.. ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదని రోజా ఆరోపించారు. పవన్ ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఎడమకాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేడని ఆమె కౌంటర్ ఇచ్చారు. పవన్ రోడ్డుపై రౌడీలా రోడ్ షోలు చేస్తున్నాడని.. ఆయనకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను దింపాలని మంత్రి రోజా సవాల్ విసిరారు.
Read Also: Bengaluru: తిండిపెట్టేందుకు డబ్బు లేదని కూతురును చంపేసిన ఐటీ ఉద్యోగి..
2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని మంత్రి రోజా జోస్యం చెప్పారు. పాలిటిక్స్ అంటే ప్రతిరోజూ యుద్ధమేనని.. వీకెండ్‌లో మాత్రమే వచ్చి రాజకీయాలు చేస్తానంటే కుదరదన్నారు. సినిమాల్లో హీరో వేషాలు వేస్తూ.. ఇక్కడకు వచ్చి జీరో వేషాలు వేస్తే ప్రజలు హీరోను చేయరనే విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇప్పటంలో జరిగిన ఘటనకు కారణం చంద్రబాబు అని మంత్రి రోజా ఆరోపించారు. ఇప్పటంలో ఏదైనా సమస్య వస్తే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ రావాలి కానీ పవన్ రావడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కావాలనే పవన్‌ను పంపించాడని.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే తన ఉనికి కోసమే జగన్‌పై నిందలు వేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని రోజా పేర్కొన్నారు.