తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే ఏపీలో ఓ పక్క వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుకావడంపై టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుఉ కావడమేంటని లోకేష్ […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 23 (మంగళవారం) నుంచి ఏపీలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం నెల్లూరులో ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. Read Also: వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన […]
ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు […]
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్‌కు మిలియన్‌ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ల ద్వారా ఎన్టీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే ఆయన ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే అది వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్‌లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. Read […]
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజుకు 200కి పైగానే కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరా గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 650 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించామని… వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. Read […]
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ-చెన్నై మార్గంలోని పడుగుపాడు వద్ద రైలుపట్టాలపైకి నీళ్లు చేరాయి. కాసేపటికే వరద ఉధృతి కారణంగా రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో పలు చోట్ల రైలుపట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. Read Also: అలెర్ట్ : ఏపీలో […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Read Also: […]
గాలె వేదికగా శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలజానో అరంగేట్రం చేశాడు. అయితే కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే సొలిజానోకు దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ ఆటగాడు సొలిజానో వికెట్లకు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొట్టిన బలమైన షాట్ సొలిజానో నుదుటిపై బలంగా తాకింది. Read Also: నా […]
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.వెయ్యి లోపు ఉండే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే గార్మెంట్స్‌పై ఇప్పటివరకు అమలు చేస్తున్న ఐదు శాతం జీఎస్టీ జనవరి నుంచి 12 శాతానికి పెరగనుంది. దీంతో వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. సాధారణంగా గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ.వెయ్యి లోపు విలువ ఉండేవే ఉంటాయి. ఈ నెల 18న రూ.వెయ్యి విలువ గల గార్మెంట్స్ మీద జీఎస్టీ శ్లాబ్‌ను 12 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం […]