భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. అంతేకాకుండా […]
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తాము డీజిల్ కార్లను తయారుచేసేది లేదని ప్రకటించింది. 2023 తర్వాత దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని.. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతాయని కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి అధికారికంగా తెలిపింది. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలను పాటిస్తూ డీజిల్ కార్ల తయారీని నిర్వహించడంతో ఖర్చు అధికంగా పెరుగుతుందని మారుతీ సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ […]
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్ […]
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన వలస కూలీ సంజయ్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక […]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 12 మందిలో ఏడుగురు కొత్తవారికి స్థానం కల్పించారు. వీటిలో బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. Read Also: […]
ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగించనివారే ఉండరు. ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో వాట్సాప్ ఉంటుంది. యూజర్లు వాట్సాప్‌ను పలురకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు చాటింగ్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఫోటోలు, వీడియోల కోసం వినియోగిస్తారు. అయితే వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో ఏదైనా ఫైల్‌ను పంపేటప్పుడు సీరియల్ నంబర్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సీరియల్ నంబర్‌ను గమనించారా? ప్రతి సీరియల్ నంబర్ సుమారు 14 అంకెలను కలిగి ఉంటుందన్న విషయం మీకు తెలుసా? Read Also: గాల్లో వేలాడుతున్న రైల్వే […]
యూపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్య నల్లగా ఉందని ఆరోపిస్తూ పెళ్లయిన 9 నెలలకు ఓ భర్త విడాకులిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న ఓ మహిళకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారు. మహిళ తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని విక్రయించి […]
కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవడం ఇది వరుసగా మూడో సారి. ఇప్పటివరకు రోహిత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, అశ్విన్‌లకు రెస్ట్ ఇచ్చిన జట్టు మేనేజ్‌మెంట్… ఇషాన్ కిషన్, చాహల్‌ను తీసుకుంది. అటు న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌథీ […]
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి మద్దతు తెలపగా… తాజాగా హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ కూడా టీడీపీ అధినేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటన దురదృష్టకరమని సోనూసూద్ వ్యాఖ్యానించాడు. దేవాలయం లాంటి సభలో వైసీపీ నేతల వైఖరి సరికాదని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ […]