గాలె వేదికగా శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలజానో అరంగేట్రం చేశాడు. అయితే కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే సొలిజానోకు దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ ఆటగాడు సొలిజానో వికెట్లకు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొట్టిన బలమైన షాట్ సొలిజానో నుదుటిపై బలంగా తాకింది.
Read Also: నా చివరి మ్యాచ్ చెన్నైలోనే : ధోని
కరుణరత్నే కొట్టిన బంతి బలంగా తాకడంతో సొలిజానో హెల్మెట్ కూడా పగిలిపోయింది. దీంతో అతడు బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజికల్ ట్రైనర్ సిబ్బంది సొలిజానోను మైదానం వెలుపలికి స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అతడికి స్కానింగ్ నిర్వహించగా గాయం తీవ్రంగానే అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ టెస్టులో సొలిజానో మళ్లీ మైదానంలోకి దిగడం అనుమానంగానే మారింది. ఈ యువ ఆటగాడు త్వరగా కోలుకోవాలని విండీస్ బోర్డు ఆకాంక్షించింది.
Hoping for good news 🙏🏾 https://t.co/aRoyAogffo
— Carlos Brathwaite (@CRBrathwaite26) November 21, 2021