రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానం: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Read Also: పల్లె దవాఖానాలపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
Also Read
ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ అంటున్నాడని… కన్నతల్లికి కోక కొనని వాడు.. పినతల్లికి బంగారు గాజులు పెట్టినట్టుంది కేసీఆర్ తీరు అని బండి సంజయ్ మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది… 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. వీళ్లందరికీ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తాడా? అని ప్రశ్నించారు. ప్రతి దానికి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తాడని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు వాస్తవం కాదా? రైతుల ఇబ్బందులు వాస్తవం కాదా? అని నిలదీశారు. ధాన్యం తడిసినా, మొలకలు వచ్చినా వెంటనే కొనాలని… బోనస్ రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!