న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే […]
నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్‌డే విషెస్‌లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్ […]
బీసీల విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా వంచన జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరమయ్యాయని గుర్తుచేశారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెలుగుదేశం తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై కేంద్రంపై ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని నిలదీశారు. […]
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా […]
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నాడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు కంటి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ చికిత్స చేయించనున్నారు. నాలుగేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో కంటికి గాయమైంది. అప్పట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రైహాన్‌కు చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఎయిమ్స్ వైద్యులు రైహాన్‌ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లో చికిత్స పొందిన […]
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు. Read […]
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట జలుబు, దగ్గు వంటి లక్షణాలతో గవర్నర్ హరిచందన్ బాధపడుతుండటంతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్ మరోవైపు గవర్నర్ సతీమణికి కూడా కరోనా […]
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని […]
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కన్నుల పండువగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇవాళ్టికి 10వ రోజుకు చేరింది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం […]
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20ని కూడా మనోళ్లు వదిలిపెట్టలేదు. దీంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను రోహిత్ శర్మ ప్రత్యేకంగా మలుచుకున్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20లో 74 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను 111 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ గప్తిల్ (52) మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో […]