తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’ […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. Read Also: ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్ సదరు పాప […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే […]
కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న అతడు తొలి ఇన్నింగ్సులో సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 170 పరుగులు చేశాడు. Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు అరంగేట్ర […]
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు. […]
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటించారని… తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని వివరించాడు. తాను చిన్నప్పటి నుంచి […]
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాసులు లేకపోవడంతో పోలీసులు శిల్పాకళావేదికలోకి వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి నందమూరి అభిమానులకు సారీ […]
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్కడికైనా వెళ్తే తలదించుకోం.. తలతెంచుకుని వెళ్లిపోతాం’ అంటూ విలన్‌ను హెచ్చరించే సీన్ అయితే అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ‘దేవుడిని కరుణించమని […]
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే […]
బిగ్‌బాస్-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొత్తం ఈ వారం ఏడుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి, సన్నీ, ప్రియాంక, కాజల్, శ్రీరామ్ ఉన్నారు. అయితే ఈ వారం సిరి, ప్రియాంకలకు ఓట్లు తక్కువగా వచ్చాయని […]