బిగ్‌బాస్-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొత్తం ఈ వారం ఏడుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి, సన్నీ, ప్రియాంక, కాజల్, శ్రీరామ్ ఉన్నారు. అయితే ఈ వారం సిరి, ప్రియాంకలకు ఓట్లు తక్కువగా వచ్చాయని సమాచారం. దీంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రవిని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also: ఆచార్య నుంచి ‘సిద్ధ’ రాకకు ముహూర్తం ఫిక్స్
కాగా హౌస్‌లో ఉన్నవాళ్లలో రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడు తన వ్యూహాలతో పదును పెట్టి ఆడుతూ వస్తున్నాడు. అందుకే అతడికి ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్ అని కూడా నాగ్ పేరు పెట్టాడు. మొదటి నుంచి కూడా విశ్వ, శ్రీరామ్, యానీలతో గ్రూప్‌గా ఉన్నప్పటికీ.. ఇండివిడ్యుయల్‌గానే రవి తన గేమ్ ఆడుతున్నాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. ఈ వారం కూడా కెప్టెన్ అవ్వాల్సింది. అయితే హౌస్ మేట్స్ సహకారం లేకపోవడంతో షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాడు. దీంతో రవి ఛాన్స్ మిస్సయ్యాడు.