ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి […]
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు […]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తొలుత ఈనెల 15న గవర్నర్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో […]
1) నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం… వచ్చేనెల 23 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు.. సాగుచట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ ఆమోదం తర్వాత ఈరోజే రాజ్యసభకు పంపే అవకాశం2) ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ కానున్న విపక్ష పార్టీలు3) ఢిల్లీ: ఈరోజు పార్లమెంట్ వరకు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా వేసిన సంయుక్త కిసాన్ […]
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్ […]
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి పట్ల జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు. రామ్‌చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట […]
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. మనిషికి మరణం ఎలా అయినా సంభవించే అవకాశం ఉంది. తాజాగా కర్ణాటకలో ఓ పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న పాము చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాడ్గెరా తాలుకా గోడిహలాకు చెందిన బసవరాజు అనే వ్యక్తి తన గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకుంటుంటాడు. Read Also: ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజన ప్రియులు ఈ […]
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల స్పందించారు. శివశంకర్ మాస్టర్ మృతి నన్ను కలిచివేసిందని… ఆయన మరణం కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. శివశంకర్ మాస్టర్‌తో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. Read Also: బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్ […]
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో కళ్యాణ సుందరం-కోమల అమల్ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు సుగన్య. ఇద్దరు కుమారుల పేర్లు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 800కు పైగా చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్ మాస్టర్‌కు మగధీర సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అరుంధతి, మహాత్మ, బాహుబలి ది […]
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. […]