1) నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం… వచ్చేనెల 23 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు.. సాగుచట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ ఆమోదం తర్వాత ఈరోజే రాజ్యసభకు పంపే అవకాశం
2) ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ కానున్న విపక్ష పార్టీలు
3) ఢిల్లీ: ఈరోజు పార్లమెంట్ వరకు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా వేసిన సంయుక్త కిసాన్ మోర్చా… నేడు సాగుచట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా వేశామని ప్రకటన
4) భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాలలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ
5) నేడు అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రకు విరామం.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ప్రకటించిన రైతులు
6) ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్‌లో చర్చించనున్న సీఎం కేసీఆర్
7) హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు
8) కాన్పూర్ టెస్ట్: భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి రోజు కొనసాగనున్న ఆట… న్యూజిలాండ్ టార్గెట్ 284 పరుగులు.. ప్రస్తుతం కివీస్ స్కోర్: 4/1