పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ […]
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై […]
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం నాడు జూ.ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు కూడా స్పందించారు. జూ.ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించాడు. అతడు […]
మద్యం తాగితే మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పడానికి ఏపీలో జరిగిన ఓ ఘటన తార్కాణంగా నిలుస్తోంది. ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. చదువు, సంధ్య లేకుండా బలాదూర్ తిరుగుతూ జల్సాలకు అలవాటు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు కూడా మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో స్నేహితులతో ప్రతిరోజూ మద్యం తాగుతూ దొంగతనాలు కూడా చేస్తున్నాడు. Read Also: రాజధాని […]
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల […]
బిగ్‌బాస్-5 తెలుగు ఆసక్తికరంగా మారింది. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే రవి ఎలిమినేషన్‌పై పెద్ద రచ్చ మొదలైంది. అతడి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేని అభిమానులు నిరసనకు దిగారు. కావాలనే రవిని ఎలిమినేట్ చేశారని.. దీని వెనుక కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. Read Also: విశాఖలో మరోసారి గ్యాస్ […]
విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ కలకలం రేపింది. వ్యర్థ జలాల పంప్ హౌస్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్.. కాగా విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు తరచూ చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. […]
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దారుణం చేసుకుంది. కొంతమంది రౌడీమూకలు ఓ యువకుడిని చితకబాది గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో మెడిసిన్స్ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రోలో వచ్చి మెహిదీపట్నం వరకు బస్సులో వచ్చాడు. అప్పటికే రాత్రి 10:30 గంటలు దాటడంతో మెహిదీపట్నం […]
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం […]
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. […]