మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. మనిషికి మరణం ఎలా అయినా సంభవించే అవకాశం ఉంది. తాజాగా కర్ణాటకలో ఓ పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న పాము చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాడ్గెరా తాలుకా గోడిహలాకు చెందిన బసవరాజు అనే వ్యక్తి తన గ్రామంలోకి వచ్చిన పాములను పట్టుకుంటుంటాడు.
Read Also: ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజన ప్రియులు
ఈ క్రమంలో శనివారం రోజు తన ఇంట్లోకి వచ్చిన ఓ పామును ఎంతో చాకచక్యంగా బసవరాజు పట్టుకున్నాడు. అనంతరం తాను పట్టుకున్న పామును గ్రామం బయట వదిలేందుకు తీసుకువెళ్లాడు. అయితే ఆ సమయంలో ఆ పాము బసవరాజును ఐదు సార్లు కాటేసింది. దీంతో అతడి శరీరమంతా విషం వ్యాపించింది. చేతిలో పామును పట్టుకుని ఉండగానే బసవరాజు ప్రాణాలు కోల్పోయాడు.