బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్ మాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో కళ్యాణ సుందరం-కోమల అమల్ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు సుగన్య. ఇద్దరు కుమారుల పేర్లు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 800కు పైగా చిత్రాలకు నృత్యాలు సమకూర్చిన శివశంకర్ మాస్టర్‌కు మగధీర సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. అరుంధతి, మహాత్మ, బాహుబలి ది బిగినింగ్ సినిమాలకు కూడా శివశంకర్ మాస్టర్ పనిచేశారు.
Read Also: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Also Read
మరోవైపు 2003లో వచ్చి ‘ఆలయ్’ మూవీతో నటుడిగా మారిన శివశంకర్.. మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో తన నటనతో అభిమానులకు నవ్వులు పంచారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా శివశంకర్ మాస్టర్ తనదైన ముద్ర వేశారు. ఆట, ఢీ జూనియర్స్ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. పలు సీరియల్స్‌లోనూ శివశంకర్ మాస్టర్ నటించారు. జీ తెలుగులో ప్రసారమైన నాగభైరవి, నంబర్‌వన్ కోడలు లాంటి సీరియల్స్‌లో ఆయన కనిపించారు. కాగా శివశంకర్ మాస్టర్ మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడు విజయ్ కూడా కరోనాతో బాధపడుతున్నారు.

తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!