ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక.. నిలిచిపోనున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం అర్ధరాత్రి కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4:30 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
Read Also: మరోసారి పెరిగిన బంగారం ధరలు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
సాంకేతిక అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఖాతాదారులను ఎస్బీఐ కోరింది. ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే తరహాలో మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22వేల బ్యాంక్ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!