ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను పేరడీ చేశారు. ఈ సాంగ్‌ను వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు. Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్ ‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు […]
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో కె.కేశవరావు ఆత్మీయంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కౌగిలించుకోవడం అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి మళ్లీ పోటీ […]
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. […]
తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ ఆరోపించారు. ఏపీలో తమ […]
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు […]
టాలీవుడ్ హీరోయిన్‌లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. Read […]
ఫేస్‌బుక్ మరో సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు.. లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ యాడ్ చేసింది. ఈ ఫీచర్.. యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందేందుకు తోడ్పడనుంది. అయితే, లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేసే అవకాశం కల్పిస్తోంది. Read Also: జనవరి 1 నుంచి […]
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఈవో స్పష్టం చేశారు. ఆర్జిత సేవా టికెట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాము ఆధార్ నిబంధనను తీసుకొచ్చినట్లు ఈవో లవన్న చెప్పారు. Read Also: జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు […]