ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు. […]
టీమిండియా యువక్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్.. ఆరో స్థానంలో బ్యాటింగుకు దిగిన కేవలం 113 బంతుల్లోనే 133 స్ట్రైక్‌రేట్, 8 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ తన సెంచరీని సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అంకితం ఇచ్చాడు. అంతేకాకుండా తలైవా […]
దేశంలో ఈశాన్య రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్‌హన్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్కపక్కనే ఉన్న 26 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు, 26 పశువుల కొట్టాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. Read Also: సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై […]
రేపటి నుంచి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్ […]
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ […]
సాధారణంగా ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కన్నీరు వస్తుంది. కానీ తరగకుండానే రైతులకు ఉల్లిగడ్డలు కన్నీరు పెట్టిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక్కసారిగా ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. Read Also: ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు శనివారం రోజు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ నుంచి శుక్రవారం నాడు సమంత ఐటం సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. “ఊ.. అంటావా? ఊ..ఊ.. అంటావా?” అంటూ సాగే ఈ పాట 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. ఇక ఐటం సాంగ్‌కు సమంత వల్ల క్రేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు దేవిశ్రీప్రసాద్ క్యాచీ […]
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని […]
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్‌లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్ […]
ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో […]