దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారిన పడ్డారు. ఆయనలో కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిరిల్ రామఫోసా కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిరిల్‌కు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని అనుమానపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం […]
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈరోజే తీసుకోండి. లేకపోతే రేపటి నుంచి రూ.500 ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్‌షిప్ ద్వారా అమెజాన్‌లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ మూవీస్, ప్రైమ్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ధర పెరగనుంది. Read Also: ఫేస్‌బుక్ నుంచి […]
తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ సాయికిరణ్ రెడ్డి పంజాబ్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారంరోజులుగా సాయికిరణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విధుల కోసం వెళ్లిన సాయికిరణ్ అసలు పంజాబ్ చేరుకున్నాడో లేదో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అతడికి ఏం జరిగిందోనని భయాందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు […]
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ‘అఖండ’ చిత్ర బృందానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పవచ్చు కానీ ఈ వేదికపైనే ఎందుకు చెప్తున్నానంటే… అఖండ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ఊపును తెచ్చిందని బన్నీ వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్‌నే సిక్సర్ కొడితే ఎంత కిక్ వస్తుందో.. తనకు ఆ కిక్ బాలయ్య అఖండ […]
✍ నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన… హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా✍ కర్నూలు: నేడు డోన్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం… వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష… హాజరుకానున్న మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం✍ నేడు తమిళనాడు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్… శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్… […]
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న టీవీషో బిగ్ బాస్ హౌస్‌లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు బిగ్‌బాస్ షో ద్వారా ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో నిర్వాహకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇందులో భాగం చేశారు. ఈ నేపథ్యంలో పచ్చదనమే రేపటి ప్రగతి పథమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ప్రతి డైరెక్టర్ పనిచేయాలనుకునే హీరో బన్నీ అని తెలిపాడు. పుష్పరాజ్‌గా బన్నీ నటన ఈ సినిమాలో వేరే లెవల్లో ఉండబోతుందని చెప్పాడు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఓ లెక్కల […]
యాదాద్రి జిల్లాలోని వంగపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కెమికల్స్ ఎగసిపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. సైరన్ మోగడంతో కార్మికులు భయంతో పరుగులు తీయగా.. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. కెమికల్స్ రోడ్డుపైన పడటంతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక […]
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగీతో బాధపడుతూ అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నాడు కన్నుమూశారు. గతంలో ఆశాబెన్ పటేల్ కరోనా బారిన కూడా పడ్డారు. ఇప్పుడు డెంగీ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరణ వార్తను జైడస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. గతంలో ఆరు సార్లు బీజేపీ తరపున ఉంఝా స్థానం నుంచి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్‌కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని […]