ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ నుంచి శుక్రవారం నాడు సమంత ఐటం సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. “ఊ.. అంటావా? ఊ..ఊ.. అంటావా?” అంటూ సాగే ఈ పాట 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. ఇక ఐటం సాంగ్‌కు సమంత వల్ల క్రేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్, సింగర్ ఇంద్రావతి వాయిస్ పెద్ద ప్లస్‌గా నిలిచాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పుష్ప ఐటం లిరికల్ సాంగ్ రాజమౌళి ‘RRR’ ట్రైలర్ తర్వాత ట్రెండింగ్-2లో ఉంది.
Read Also: బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
కాగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఘనంగా జరగనుంది. అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. ఈ సినిమా ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.