బిగ్‌బాస్-5: వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకున్న హీరో నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న టీవీషో బిగ్ బాస్ హౌస్‌లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు బిగ్‌బాస్ షో ద్వారా ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో నిర్వాహకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇందులో భాగం చేశారు. ఈ నేపథ్యంలో పచ్చదనమే రేపటి ప్రగతి పథమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. ‘ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు వారాల సమయం ఉందని.. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ మూడు వారాలు.. వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి‘ అంటూ నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. అంతేకాదు మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను బిగ్‌బాస్ స్టేజీపైకి ఆహ్వానించారు.

గత ఐదేళ్లుగా మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటిన రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను నాగార్జున అభినందించారు. ఒక్క మనిషి తన ఆలోచనతో, ప్రకృతి బాగుండాలనే తపనతో కోట్లాది మొక్కలు నాటితే.. బిగ్ బాస్ హౌస్ పిలునిస్తే ఇంకా ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోండని ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టి భవిష్యత్ తరాలు ఈ భూమిపై మనుగడ సాగించాలంటే.. మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాగార్జున ప్రేక్షకులకు సూచించారు.
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటాలి, కాపాడాలి అనే ఆలోచనను కలిగించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ‘ఒకచోట ఒకరు ఒకటి రెండు మొక్కలు నాటారు, మరోచోట టీంలుగా కొంతమంది కలిసి మొక్కలు నాటారు. ఇక స్టార్స్, సెలెబ్రెటీలు అయితే ఫారెస్ట్ లను దత్తత తీసుకున్నారు. హీరో ప్రభాస్ 1643 ఎకరాలు, హెటిరో డ్రగ్స్ పార్ధసారథి రెడ్డి 2500 ఎకరాల అడవులను దత్తత తీసుకుని మొక్కల్ని పెంచుతున్నారు. మేం నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తునే ఉంటాం, మా ఈ ప్రయత్నం ఈరోజు మీ ద్వారా కోట్లమందికి చేరింది. ఇంత అద్భుతమైన షోలో మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జున గారికి, స్టార్ మాటీవీ వారికి, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్లకు, టెక్నిషీయన్‌లకు కృతజ్ఞతలు’ అంటూ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు.

చివరగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వారి మాటలు, స్పూర్తి తనను ఎంతో కదిలించాయన్నారు. తాను కూడా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకుంటానని.. సంతోష్ కుమార్ ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకుని మొక్కలను పెంచుతానని తెలిపారు. సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాగార్జున పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!