తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 45 ఏళ్ల కిందట వివాహమైన ముగ్గురు వృద్ధులకు కళ్యాణలక్ష్మీ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్‌బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కళ్యాణలక్ష్మీ ఆర్థిక సాయం […]
తెలంగాణ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్ అయితే […]
మహిళకు మధ్య వేలు చూపించిన 33 ఏళ్ల వ్యక్తికి ముంబైలోని ఓ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2018, సెప్టెంబర్ 17న ముంబైలో ఓ మహిళ, తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా వారు క్యాడ్‌బరీ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి ఓ రెడ్ కలర్ కారు తమ ముందుకు దూసుకువచ్చింది. దీంతో మహిళ ప్రయాణిస్తున్న కారు 100 మీటర్ల వరకు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. అలా […]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ఛాంబర్ ముందు తండ్రి, కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య అనే వ్యక్తి వెల్లడించాడు. Read Also: దేశంలోనే నంబర్‌వన్ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి 20 ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు […]
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని […]
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మొదటి […]
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్‌లలో రాకింగ్ రాకేష్ ఒకడు. ఇతర కమెడియన్‌ల స్కిట్లకు భిన్నంగా రాకింగ్ రాకేష్ స్కిట్లు ఉంటాయి. అందుకే ప్రేక్షకులను అతడి స్కిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా కెరీర్ సాగిస్తున్న రాకింగ్ రాకేష్ తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. Read Also: బిగ్‌బాస్-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా? వివరాల్లోకి వెళ్తే… ఆదివారం నాడు శంషాబాద్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 […]
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు వినూత్న ప్రచారం చేపట్టారు. కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోకపోతే రేషన్, పెన్షన్ పంపిణీ నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో మెగా […]
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌లో 150కి పైగా […]
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఫైనల్ వీక్‌కు చేరుకుంది. టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టమైంది. కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో టాప్-5లో సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఉన్నారు. వీరిలో బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తారో ఈ వారం తేలిపోనుంది. ఎక్కువ శాతం సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే యూట్యూబర్ షణ్ముఖ్‌కు ఫాలోయింగ్ బాగా ఉండటం.. బయట అతడి స్నేహితురాలు దీప్తి సునయన పెయిడ్ ఓట్లు […]