Tirumala: శ్రీవారికి కాసులే కాసులు.. వరుసగా 9వ నెల కూడా రికార్డు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. 8 నెలలుగా ప్రతి నెలా తిరుమల వెంకటేశుడి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతోంది. తాజాగా వరుసగా 9వ నెల కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం.
Read Also: Akhanda: బాలయ్య మ్యాజిక్ ని రిపీట్ చేయడం కష్టమే
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
నవంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.127.3 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1600 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 9 నెలల కాలంలో అత్యధికంగా జూలై నెలలో రూ.139.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య ప్రతి రోజూ 70 వేలకు పైగా ఉండటం, నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం ప్రతి రోజూ లభిస్తుండటంతో ఈ స్థాయిలో హుండీ ఆదాయం సాధ్యమవుతోంది. ఇప్పటి వరకు 2019-20 వార్షిక సంవత్సరంలో లభించిన రూ.1,313 కోట్లే అత్యధిక హుండీ ఆదాయంగా ఉంది. ఇదే ఏడాది జూలై 4న శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల హుండీ ఆదాయాన్ని భక్తులు సమర్పించారు.
కరోనా తర్వాత భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మొక్కులను ఒకేసారి తీర్చుకుంటున్నారు. అందుకే ఆదాయం నెలకు వంద కోట్లకు పైగానే వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో వసతులు, అన్నదానం వంటి సౌకర్యాలను కూడా పెంచారు. వచ్చే నెలలో వైకుంఠ ఏకాదశి వస్తుండటంతో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!