అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. […]
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది. […]
సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది అకౌంట్లలో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. Read Also: రాజమండ్రికి కేంద్రం న్యూ ఇయర్ కానుక.. ఓఆర్‌ఆర్ మంజూరు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు చోటుచేసుకున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్ పదవికి నియమించాలని లేఖలో కోరారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓ సీనియర్ నాయకుడిగా తాను కూడా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. Read Also: రైతులకు గుడ్ […]
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ నగరంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్న తరుణంలో ఆయన కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు సోమవారం నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Read Also: షెడ్యూల్ ప్రకారమే… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి […]
ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం నాడు వైద్యశాఖ అధికారులతో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ […]
జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్లు జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం చిన్నారులు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. వీళ్లు తప్పనిసరిగా […]
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్‌లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్ […]
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కావడంతో ఎన్నికలు వాయిదా పడతాయని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం చర్చించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ […]
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. Read Also: IND Vs SA: […]