సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. రెండో రోజు ఆటను పూర్తిగా అడ్డుకున్నాడు. దీంతో రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. Read Also: టెస్టుల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు కాగా తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికాపై […]
ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు. Read […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కరోనా మందు పంపిణీ చేసే ఆనందయ్యకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే… ఒమిక్రాన్ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. కరోనా మందు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరావడం వల్ల తమకు కరోనా సోకుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కరోనా మందు పంపిణీని అడ్డుకున్నారు. Read Also: గోవాలో రెచ్చిపోయిన సమంత.. […]
తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం నాడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయమన్నారు. అయితే తన తమ్ముడితో […]
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న […]
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీలోని జగన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను సోమవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తమ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 53, జీవో నంబర్ 54ను ప్రభుత్వం జారీ చేసింది. Read Also: ఏపీ సర్కార్‌తో చర్చల దిశగా […]
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల […]
తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. అయితే అతడి భార్య, తల్లితో పాటు స్నేహితుడికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. Read Also: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు తాజాగా నమోదైన మూడు […]
సెల్ఫీల మోజు కారణంగా యువత తమ ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా తెలంగాణలో సెల్ఫీ మోజులో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు. Read Also: అంతర్వేదిలో చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలుసా? వెంటనే గమనించిన స్థానికులు […]
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాకుండా రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చని సూచించింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వాడుకోవచ్చని పేర్కొంది. అటు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వాడుకోవచ్చని… ఈ ప్లాన్ వ్యాలిడిటీ […]