తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు చోటుచేసుకున్నాయి. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నేత జగ్గారెడ్డి లేఖ రాశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్ పదవికి నియమించాలని లేఖలో కోరారు. రేవంత్ వ్యవహారశైలితో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని.. నేతలతో చర్చించకుండానే ఆయన పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఓ సీనియర్ నాయకుడిగా తాను కూడా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి సొమ్ము
హుజురాబాద్ ఉప ఎన్నికలతో పాటు తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను సోనియా, రాహుల్ గాంధీ దృష్టికి లేఖ ద్వారా జగ్గారెడ్డి తీసుకువెళ్లారు. రేవంత్‌తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని… పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే తన తాపత్రయమన్నారు. రేవంత్‌ను పార్టీ డైరెక్షన్‌లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదో కుట్ర జరుగుతోందని.. ఈ విషయంపై అధిష్ఠానం విచారణ జరిపించాలని కోరారు.