వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే […]
మేషం: కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. క్రీడ, కళ, సాంస్మక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్‌లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురం యూనివర్సిటీకి అప్పగించారు. సెట్ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఏపీసెట్‌ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుండగా.. అధికారులు ఈసారి మార్పు చేశారు. అటు ఈఏపీ సెట్ […]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20న విశాఖలో పర్యటించనున్నారు. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి వెళ్లనున్నారు. ఈనెల 21న నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. తిరిగి ఈనెల 22న ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ […]
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. నిరుద్యోగుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలలోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందస్తుగా పలు చోట్ల విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: Pawan Kalyan: […]
★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ… మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి హాజరయ్యే అవకాశం★ అమరావతి: నేడు కొత్తల జిల్లాల ఏర్పాటు పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష★ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ ఏపీలో నేడు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు నిరుద్యోగ సంఘాల పిలుపు… ఈ నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థి సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొన్ని విద్యార్థి […]
విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు. Read Also: Bonda Uma: సీఎం జగన్ ఇంటిని […]
టెస్టుల్లో టీమిండియాకు ఆడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రంజీ జట్టు నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను రంజీ ట్రోఫీ ఆడటం లేదని బీసీసీఐకి సాహా సమాచారం ఇచ్చాడు. టీమిండియా త్వరలో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తనను సెలక్టర్లు ఎంపిక చేయరనే విషయం తెలుసుకుని.. మనస్తాపం చెందిన సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ ఆటగాడు రిషబ్ […]
జిల్లాల విభజన నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద బోండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం ఇష్టం […]