Ramesh Nalam
Author- NTV Telugu-
పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం డేట్ ఫిక్స్
వాలంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ESO-04 లాంచింగ్‌ను ఫిబ్రవరి 14న జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 14న ఉదయం 5:59 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా నిర్వహించాలని తలపెట్టారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. Read Also: […] -
కార్వీ సంస్థకు మరో ఎదురు దెబ్బ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ (NCLT) విచారణ జరిపింది. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో […] -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నోట ‘పుష్ప’ డైలాగ్
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ విడుదలై 50 రోజులు దాటుతున్నా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ మూవీలోని బన్నీ డైలాగులు, మేనరిజంలు ఎంతో పాపులర్ అయ్యాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, మేనరిజంలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ల దగ్గర నుంచి సాధారణ వ్యక్తుల దాకా పలువురు పుష్ప సినిమాలోని డైలాగులు, సాంగ్స్‌తో రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. […] -
వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో వీడిన మిస్టరీ
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు […] -
LIVE: భీష్టాష్టమి రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సంతాన ప్రాప్తి
-
ఫిబ్రవరి 9, బుధవారం దినఫలాలు
మేషం: శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం. వృషభం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు […] -
నేడు విండీస్‌తో రెండో వన్డే.. సిరీస్‌పై టీమిండియా కన్ను
అహ్మదాబాద్ వేదికగా ఈరోజు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ వన్డేను కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసి.. తద్వారా సిరీస్ సాధించాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో […] -
ఏపీలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు
ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్‌ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్★ నేడు, రేపు తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన… సాయంత్రం తిరుమల చేరుకోనున్న వెంకయ్యనాయుడు.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి★ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని నేడు విజయవాడ ధర్నా చౌక్‌లో టీడీపీ నేత బోండా ఉమా దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్న బోండా ఉమా★ రాష్ట్ర విభజన అంశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై […] -
పీఆర్సీ రగడ.. సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ
ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని.. ఈ విషయంలో పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టిపెట్టాలని లేఖలో కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Read Also: ఎర్రజెండా వెనుక పచ్చజెండా […]
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?