Bonda Uma: సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తాం.. బోండా ఉమ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాల విభజన నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద బోండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు.
అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తోందని బోండా ఉమ మండిపడ్డారు. కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా అని నిలదీశారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్నారు. జిల్లాల విభజనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలన్నారు. రంగా అభిమానులను కించపరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని బోండా ఉమ హెచ్చరించారు.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!