మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. వృషభం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో […]
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్‌లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ రాని వారికి ఏప్రిల్ నెల నుంచి నగదు అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి.. కొత్తవి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని.. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని […]
ఈరోజు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచిన భారత్ ఇప్పుడు మూడో వన్డేపై కన్నేసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో… ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ […]
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468, […]
★ నేడు మరోసారి హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. హైటెక్స్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్న జగన్★ ఏపీ వ్యాప్తంగా పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాల నిరసనలు. 27 శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్.. నేడు కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ★ తూ.గో.: నేడు, రేపు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు★ ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేడు […]
రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోదీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ పనిగా పెట్టుకున్నారని మంత్రి హరీష్‌రావు […]
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మధ్యాహ్నం మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,05,052 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు […]
టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలు, ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 14 రకాల విజ్ఞప్తులను టాలీవుడ్ బృందం సీఎంకు వివరించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్‌బాబు మాట్లాడాడు. ఆరు […]
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో […]
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్‌బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 […]