కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నుదుటన సింధూరం పెట్టుకోవడం తనకు ఇష్టమని.. అలాగే హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే నిర్ణయించుకోనివ్వండి.. మాకు నేర్పించకండి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహిళలు సృష్టికర్తలు అని, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ […]
ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల […]
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో […]
రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు గుర్రుమంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు […]
తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ యూపీలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్‌లోనే విషం తాగాడు. వ్యాపారితో పాటు ఆయన భార్య కూడా విషం తాగింది. ఈ ఘటనలో భార్య చనిపోయింది. వ్యాపారి రాజీవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రధాని మోదీపై వ్యాపారి రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం […]
దేశంలో ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయింది. బుధవారం కాస్త పెరిగిన కరోనా కేసులు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం 71,365 కేసులు నమోదు కాగా గురువారం కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,06,520గా ఉంది. […]
విశాఖలో శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని పోలీసులను నిలదీశారు. ప్రజలకు అసౌకర్యం కల్గినందుకు చింతిస్తున్నానన్న జగన్.. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. కాగా బుధవారం సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు […]
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు […]
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్‌లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also: Petrol Prices: సామాన్యులకు […]
గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్‌పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు […]