హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్లకు హాజరుకావొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముస్లిం విద్యార్థులు సవాల్ చేశారు. అయితే హిజాబ్ అంశంపై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడతామని […]
ఏపీ రాజధాని ఏది అంటే ప్రస్తుతం ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. ఇది విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా […]
పెరూలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. 100 మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా 20 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా అతి వేగం, రోడ్లు […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు, […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. తాజాగా కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది అటు తాజాగా దేశవ్యాప్తంగా […]
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే […]
గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రీతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన విషయం ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఈ సిరీస్ విజయం సాధించడంలో తాత్కాలిక కెప్టెన్ రహానె కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం, పలువురు […]
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై నిలదీస్తున్నందుకే.. ప్రభుత్వం కక్ష గట్టి అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అసలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని… సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ప్రతి తప్పుకు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా […]
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ లీలలు బయటపడుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ఏ సామాజిక వర్గం వారికైనా ఎస్టీ సర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఆయన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. అయితే సదరు వ్యక్తి షేక్ […]