★ నేటితో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఏడాది పూర్తి.. 365 జెండాలతో నిరసన తెలపనున్న కార్మిక సంఘాలు★ తూ.గో.: నేడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం★ తూ.గో.: నేడు ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణం★ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. యాదాద్రిలో యాగశాలను ప్రారంభించనున్న కేసీఆర్.. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభం.. సా.4 గంటలకు రాయగిరిలో కేసీఆర్ బహిరంగ సభ★ హైదరాబాద్ ముచ్చింతల్‌లో వైభవంగా 11వ రోజు సహస్రాబ్ది ఉత్సవాలు.. […]
మేషం: కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. వృషభం: భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు స్థానచలన మార్పుతథ్యం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గత […]
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలానికి అనుగుణంగా అనురాగ్ సెట్, అగ్రి సెట్ పేర్లతో ఎంట్రన్స్ పరీక్షలను అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనురాగ్ సెట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేయగా.. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అగ్రి సెట్‌ను ఏర్పాటు చేశారు. అనురాగ్ సెట్, అగ్రి సెట్ పరీక్షలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. ఆయా పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 3 వరకు సమర్పించవచ్చని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మార్చి […]
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో […]
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో […]
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా […]
ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మళ్లీ ఆ సమస్యను పరిష్కరించినట్లు సీఎం జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఎవరు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించమన్నారు? ఎవరు పెంచమన్నారు వైఎస్ జగన్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించినట్లు డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం మీకే చెల్లింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి […]
క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్‌లో సచిన్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. […]
దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్‌టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌టెల్ […]