ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో ఈరోజు 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి లాంటి రోజన్నారు. ఏపీలో జాతీయ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.10,400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని జగన్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి […]
టీటీడీ బోర్డు గురువారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాకుండా సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారు తాపడ […]
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాతగా పూర్ణ దర్శకత్వంలో మాట్ల తిరుపతి రచనలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పాటను చూడగానే సీఎం కేసీఆర్ […]
శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా […]
కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ ఐదో బంతికే బ్రెండన్ కింగ్ (4)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్ బౌండరీ లైన్ […]
అమరావతిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. పార్టీ అనుబంధ కమిటీల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగి ఉపయోగం లేదన్నారు. Read Also: Andhra Pradesh: అండర్-19 క్రికెటర్‌పై ఏపీ సీఎం […]
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అటు బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో అతడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్ […]
ఇటీవల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున సత్తా చాటిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ బుధవారం నాడు ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. షేక్ రషీద్ మరింత మెరుగ్గా ఆడేందుకు అతడికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. షేక్ రషీద్‌కు గుంటూరులో ఇంటి స్థలం, రూ.10 లక్షల నగదుతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా […]
తెలంగాణలో మేడారం జాతర ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈ జాతర కోసం ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో టీఎస్‌ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రజలు ఆర్టీసీ బస్సులనే ఎక్కాలంటూ వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో ఎన్నో కొత్త సినిమాలను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్‌ల కోసం వాడుకున్న టీఎస్‌ఆర్టీసీ తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటను వాడేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. […]
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రాణదాన ట్రస్టుకు ఆన్‌లైన్‌లో విరాళాల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇందులో భాగంగా రూ.కోటి విరాళాలు అందించిన భక్తులకు టీటీడీ ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయిస్తోంది. శుక్రవారం రోజు ఈ సేవ పొందాలంటే రూ.1.5 కోట్లు విరాళంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం 531 టిక్కెట్లను టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచగా.. ఇప్పటివరకు రూ.82 కోట్ల విరాళాలకు సంబంధించి 68 టిక్కెట్లను మాత్రమే భక్తులు పొందారు. ఇందులో శుక్రవారం టిక్కెట్లు 28 […]